తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్‌రావు పేరు దాదాపు ఫైనల్ అయింది. అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేసినట్లు తెలిసింది. అయితే, ఈ ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వార్తలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని పెట్టే పార్టీ బీజేపీ కాదని.. అధిష్టానం ఇంకా అధ్యక్షుడిని ప్రకటించలేదని చెప్పారు.