తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమంతో ప్రశంసలు అందుకుంటోంది. మేనేజింగ్ డైరెక్టర్ (MD) ఆదేశాల మేరకు.. కండక్టర్లు ప్రతి ట్రిప్ ప్రారంభంలో ప్రయాణికులను వినమ్రంగా పలకరించే విధానం మొదలైంది. బండ్లగూడ డిపోలో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ విధానం ప్రయాణికులకు సానుకూల అనుభవాన్ని కల్పిస్తూ.. ఆర్టీసీ సేవల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.