తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశ నుంచే చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులతో పాటు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పుల భారంలో చిక్కుకుని.. బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి తనను కష్టపడి చదివించినా ఉద్యమంలోకి వెళ్లి జీవితాన్ని పాడుచేసుకున్నానని అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భార్య, పిల్లలకు క్షమాపణలు చెప్పారు. ఆయన మృతిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేయగా.. మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు.