తెలంగాణలో ఎన్నికలకు జనసేన ముందుగానే సిద్ధమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును ప్రకటించింది. గతంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహించిన గడల శ్రీనివాసరావు.. ప్రస్తుతం జనసేన రాష్ట్ర నాయకుడిగా, అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. పట్టభద్రులు, ఉద్యోగులు, యువత, విద్యావంతులు, మేధావుల సమస్యలను శాసన మండలిలో బలంగా వినిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.