తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ రానున్నారు. తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో.. యూపీఎస్సీ పంపిన ముగ్గురు సీనియర్ల జాబితాలో అత్యంత సీనియర్ అయిన ఆనంద్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హోంశాఖలో ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీలు కూడా ఈ మార్పును ధృవీకరిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.