తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయగా.. ఆ తర్వాత సీవీ ఆనంద్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్ ఇప్పటివరకు పలు హోదాల్లో పనిచేశారు.