Facial Recognition For Cheyutha Pensions In Cities And Towns In Telangana: తెలంగాణ ప్రభుత్వం పించన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసినట్లుగా నగరాలు, పట్టణాల్లో కూడా ఫేషియల్ రికగ్నేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులకు తగిన శిక్షణ కూడా ఇస్తోంది. అనంతరం జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ పూర్తిచేసి కొత్త విధానాన్ని అమలు చేస్తారు.