తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. వడగాల్పులకు బ్రేక్, నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

4 months ago 21
తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలోని తూర్పు జిల్లాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత నేటితో ముగియనుందని చెప్పారు. అలాగే పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ సహా పలు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్ష హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో మే 6 నుంచి వర్షాల తీవ్రత పెరగనుందని చెప్పారు.
Read Entire Article