తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపికబురు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం గురించి కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక.. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. దసరా పండుగను పురస్కరించుకుని.. దసరా ముందు రోజు అంటే అక్టోబర్ 11వ తేదీన ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.