హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు నిర్ధారించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని భావిస్తున్నారట. ఈ ప్రక్రియ మూడు నెలల పాటు సాగనుండగా.. అప్పటి వరకు కూల్చివేతలు ఉండవని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.