తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్‌సిటీలో ఏసీలు లేకుండానే చల్లదనాన్ని అందించే సరికొత్త డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ (DCS) ను ప్రవేశపెట్టనుంది. ఈ వినూత్న విధానం ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి మేలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఈ విధానం విజయవంతంగా అమలు అవుతోంది. కొత్తగా నిర్మిస్తోన్న మాల్స్, నగరాలు, టౌన్‌షిప్‌లలో ఈ విధానం అమలు చేస్తున్నారు.