తెలంగాణలో మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అందుకే రాష్ట్రంలో కిశోర బాలికలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు సీతక్క ప్రకటించారు. అంతేకాకుండా మహిళా సంఘాలు ముందుకు.. వస్తే క్యాంటీన్లు, పాల బూత్‌లు వంటివి ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.