తెలంగాణలోని మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు.. రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే.. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గానూ.. రూ.110 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది.