తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్. ఇప్పటికే ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తుండగా.. ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఫార్మా రంగంలో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు భారీగా ఉద్యోగ, ఉపాధి అకకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 6 దిగ్గజ ఫార్మా కంపెనీలు ముందుకు వచ్చాయి. మెుత్తం రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా.. 12,490 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.