Telangana Farmers Paddy Procurement Money In 48 Hours: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. గత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామనిజజ ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్పీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.