తెలంగాణలో రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో శుభవార్త వినిపించారు. ఇప్పటికే రైతు రుణమాఫీ అమలు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. అయితే.. రైతులకు మరో ఆకర్షణీయమైన పథకాన్ని సిద్ధం చేసింది ప్రభుత్వం. వ్యవసాయ మోటర్లకు సోలార్ పంపు సెట్లు పంపింణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.