తెలంగాణలో ప్రస్తుతం వర్షాలకు అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వారం తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని.. ఆ తర్వాతే వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు.