తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఎన్నికల నిర్వహణపై త్వరలోనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. బీసీ రిజర్వేషన్ల నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత.. ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో బీసీ కమిషన్ నివేదికను సమర్పించనుండగా.. ఆ తర్వాత కేబినెట్ భేటీలో చర్చించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.