రాజకీయాల్లో సరిహద్దులు లేవని నిరూపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఉన్న అభిమానంతో తెలంగాణలో ఒక అభ్యర్థి సర్పంచ్‌గా విజయం సాధించారు. ప్రచారంలో పెమ్మసాని ఫోటోను వాడుకుని గెలిచిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. మంత్రి స్పందించి ఆ సర్పంచ్‌ను తన నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి.. గ్రామ అభివృద్ధిపై చర్చించారు. సేవా గుణమే తనను ప్రభావితం చేసిందని సర్పంచ్ తెలపగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసే వారిని ప్రోత్సహిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.