తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్ రింగు రోడ్డు విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా.. దానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల మెుదటి వారంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.