దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణకు చెందిన విద్యార్థిని కలుసుకుంది. కేవలం కలవటమే కాదు.. ఆయనతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని.. మోదీని ప్రశ్నలు కూడా అడిగింది. ఏటా నిర్వహించి పరీక్షా పే చర్య కార్యక్రమంలో భాగంగా.. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలానికి చెందిన మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థిని.. ప్రధాని మోదీని కలిసింది. ఈ సందర్భంగా.. ప్రధానితో మాట్లాడింది. అంజలి ప్రధానిని కలవటంపై ఆమె చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.