తెలంగాణకు కొత్త డీజీపీ రానున్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి మూడో ఫుల్ టైం డీజీపీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సీనియర్ అధికారులతో లిస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపించగా.. అందులో ముగ్గురి పేర్లతో లిస్ట్ ఫైనల్ చేసింది. ఈ జాబితాలో ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి ఉండటం విశేషం. అయితే తెలంగాణకు తొలి మహిళా డీజీపీ రానున్నారా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.