నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలోని దక్షిణ జిల్లాలతో పాటుగా రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.