బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబరు 3న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మురసుగా నామకరణం చేసిన ఈ తుపాను ప్రభావంతో నవంబరు 4 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు.