బీటెక్‌ మధ్యలోనే ఆపేసి దొంగతనాలు.. ఉప్పల్ చోరీ కేసులో మహిళ అరెస్ట్, రూ.70 లక్షల సొత్తు స్వాధీనం

1 hour ago 1
హైదరాబాద్‌లో బురఖా ధరించి, హ్యాండ్‌ కట్టర్‌ మిషన్‌తో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న పాగ జయ అనే మహిళను ఉప్పల్‌ పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఆమె ఆర్థిక ఇబ్బందులతో బీటెక్‌ మొదటి ఏడాదిలోనే చదువు మానేసింది. 2023లో హైదరాబాద్‌కు వచ్చి వివాహం చేసుకున్న అనంతరం చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, జగద్గిరిగుట్ట, మేడిపల్లి, ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఆమె నుంచి రూ.70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article