తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. నాగర్కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న రోజుల్లో మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, శనివారం సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ఏరియాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.