తెలంగాణకు వర్ష సూచన.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

2 months ago 13
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ పరిధిలోని పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయని అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రయాణికులు వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్త వహించాలని రైతులు పిడుగుల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ప్రభుత్వం, వాతావరణ శాఖ కీలక విజ్ఞప్తి చేశాయి.
Read Entire Article