తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. హైదరాబాద్‌లో సాయంత్రం వరకు పొడి వాతావరణం, రాత్రి నుంచి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో అలర్ట్ జారీ చేశారు.