ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన 'మెంథా' తుఫాను ఇప్పుడు తెలంగాణపై తన ప్రభావాన్ని చూపుతోంది. రాబోయే 6-8 గంటల్లో తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టనుండగా... దక్షిణ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.