తెలంగాణలో కొత్త 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు లైన్ క్లియరైంది. ఇప్పటికే.. మరికొన్ని సాధారణ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒక స్టేషన్ ఏర్పాటు చేయనుండగా.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఇవి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం కొన్ని అద్దె భవనాలు గుర్తించగా.. మరికొన్నింటినీ ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్లలోని ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేయనున్నారు.