తెలంగాణలో 315 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కేంద్రానికి వివరించారు. సూక్ష్మ సేద్యం, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలకు తక్షణ సాయం అందించాలని, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరారు. మరోవైపు.. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నీరు, విద్యుత్ను పొదుపుగా వినియోగించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు చేరిందని తెలిపారు.