తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 71 లక్షల మంది ఓటర్లు అన్‌కలెక్టబుల్ కేటగిరీలో ఉన్నట్లు తేలింది. ఇందులో సగానికి పైగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నట్లు వెల్లడైంది. ఇక నేటితో ఎస్ఐఆర్ గడువు ముగియడంతో ఇప్పుడు ఫారాల పరిశీలన, ధ్రువీకరణ అనంతరం తుది ఓటర్ల జాబితా ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.