తెలంగాణలో కులగణన రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని 78 శాతం కుటుంబాలకు ఆదాయం ఏడాదికి రూ. లక్ష కంటే తక్కువగానే ఉందని తెలిపింది. అదే సమయంలో తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలు.. అగ్రవర్ణాల కంటే 3 రెట్లు వెనుకబడి ఉన్నాయని తేలింది. అదే సమయంలో మొత్తం 242 కులాలు ఉండగా.. అందులో 135 కులాలను అత్యంత వెనుకబడినవిగా గుర్తించారు.