రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని వేచి చూస్తున్న ఆశావహులకు మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆలస్యమైన ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఈ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేలా లేవు. జనగణన, ఉద్యోగుల బదిలీలతో పాలనపరమైన నిర్ణయాల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ఇప్పట్లో ఉండదని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీంతో ప్రత్యేక అధికారులే పాలన సాగించనున్నారు.