తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి భారీ ఊతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో.. పర్యాటక రంగంలో రూ. 7,045 కోట్ల విలువైన ఎంవోయూలు (MoUs) కుదిరాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 40,000 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. వీటిలో 10,000 డైరెక్ట్ అండ్ 30,000 ఇన్ డైరెక్ట్ లభిస్తాయని అంచనా. ఈ ప్రాజెక్టులలో కన్వెన్షన్ సెంటర్లు, ఆక్వా మెరైన్ పార్క్, గోల్ఫ్ డెస్టినేషన్, వెల్‌నెస్ రిట్రీట్‌లు వంటివి ఉన్నాయి. ఈ ఒప్పందాలతో తెలంగాణ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది.