ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అక్రమాల ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం.. ప్రయివేట్ ఇంజినీరింగ్ సహా ఉన్నత విద్యా సంస్థల్లో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. బకాయిల చెల్లింపులో జాప్యంపై ప్రైవేట్ విద్యాసంస్థలు నవంబర్ 3 నుంచి కాలేజీలను మూసివేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఈ పరిణామాలు ప్రభావం చూపనున్నాయి. మరోవైపు, విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అక్టోబరు 30న బంద్ పాటిస్తోంది.