ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించాయి. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. దీనివల్ల 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడనుంది.