తెలంగాణలో ఇండ్లులేని పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది. ఆ సర్వే కూడా 95 శాతం పూర్తికాగా.. అతిత్వరలోనే నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే.. మరో కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఫిర్యాదు కోసం ప్రత్యేక వెబ్ సైట్ తీసుకొచ్చినట్టు తెలిపారు.