Telangana By Elections: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉపఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తేల్చి చెప్పారు. సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు. ఇతర పార్టీ నేతలు తమతో చేరినా ఉపఎన్నికలు రానే రావని స్పష్టం చేశారు. ఈ కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున తీర్పు వచ్చాకనే ఏదో ఒకటి జరుగుతుందని తెలిపారు.