తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కేసులు, నోటీసులు, విచారణలు, అరెస్టులు అంటూ నిత్యం కీలక పరిణమాలతో హాట్ హాట్‌గా మారిపోయాయి. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కొట్టిన ఎమ్మెల్యేలపై త్వరలోనే అనర్హత వేటు పడనుందని.. ఉపఎన్నికలు ఖాయమంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కొన్ని సంస్థలు సర్వే నిర్వహించాయి. ఇందులో ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి.