తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా కొత్తగూడెం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాలను ఏఏఐ బృందం పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.