తెలంగాణలోని గీత కార్మికుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రావు పాల్గొని.. కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే.. మంత్రి పొన్నం ప్రభాకర్ మరో గుడ్ న్యూస్ వినిపించారు. గీత కార్మికులకు ఉచితంగా మోపెడ్ వాహనాలను కూడా అందించనున్నట్టు మంత్రి ప్రకటించారు.