తెలంగాణ పోలీస్ విభాగంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. శాంతి భద్రతలను సమర్ధవంతంగా పరిరక్షించడం, పాలనను మరింత వేగవంతం చేయడం, కొత్తగా ఏర్పడే విభాగాలకు అనుభవజ్ఞులైన ఆఫీసర్లు నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నియమాకాలను చేపట్టింది. తాజా బదిలీల్లో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ వంటి విభాగాలకు సీనియర్ అధికారులను నియమించింది. రెండు రోజుల కిందట ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది.