దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణతో తొలి ఒప్పందం కుదిరింది. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయిన యూనిలివర్ గ్లోబల్ సంస్థతో తెలంగాణ సర్కార్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. దీంతో.. కామారెడ్డిలో పామాయిల్ తయారీ కంపెనీ స్థాపించేందుకు యూనిలివర్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో పాటు బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్ పెట్టేందుకు కూడా కంపెనీ ఆసక్తికనబర్చింది. ఈ మేరకు.. ఒప్పందాలు కూడా చేసుకుంది.