తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను ఒకేసారి కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆవాస్ ప్లస్-2024 సర్వేలో 11.56 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా గుర్తించామని.. అనర్హుల తొలగింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. తెలంగాణలో 12 ఏళ్లుగా పేదల ఇళ్ల నిర్మాణంలో ఏర్పడిన అంతరాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ ఇళ్లను ప్రకటించాలని కోరారు. ఈ క్రమంలోనే తెలంగాణ పర్యటనకు రావాలని కేంద్రమంత్రిని కోరారు.