Telangana Plastic Flowers Banned In Markets And Rythu Bazars: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో ప్లాస్టిక్ పూల విక్రయాలపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ మార్కెట్లు, రైతు బజార్లలో ప్లాస్టిక్ పూల విక్రయాలపై మార్కెటింగ్ శాఖ నిషేధం విధించింది. ఇటీవల రైతులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ ప్లాస్టిక్ పూల విక్రయాలపై ఫిర్యాదు చేశారు. తాము నష్టపోతున్నామని ఆవేదవన వ్యక్తం చేశారు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.