Telangana Divorce Rate: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఒక్కసారి దంపతులకు పడిన బ్రహ్మముడి.. చివరివరకు విడిపోదంటూ పెద్దలు చెప్పేవాళ్లు. బంధువులందరి సమక్షంలో పట్టుకున్న భర్త చిటికనవేలును.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ భార్య విడిచిపెట్టొద్దని.. ఆ భర్త ఆమె చేతిని వదిలేయొద్దని ప్రమాణం చేపిస్తారు. కానీ.. ప్రస్తుత రోజుల్లో అలాంటి ప్రమాణాలు.. దంపతులను ఏమాత్రం అడ్డుకోవట్లేదు. తాజాగా వచ్చిన రిపోర్టుల ప్రకారం.. దేశంలో విడాకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. దేశంలో అత్యధిక డివోర్స్ రేట్ ఉన్న ఏడు రాష్ట్రాల జాబితా ఇప్పుడు వైరల్‌గా మారింది.