హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించనుండగా.. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. మే 1వ తేదీన ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా ఈ షెడ్యూల్ విడుదల చేసింది.