మల్కాజ్‌గిరి పరిధిలోని రాధాకృష్ణ నగర్ (ఆర్కే నగర్) కాలనీ పేరును నూతన రైల్వే స్టేషన్‌కు పెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. ఈ స్టేషన్‌ను చర్లపల్లి-బొల్లారం మార్గంలో దయానంద్‌నగర్ స్టేషన్‌తో పాటు అమృత్ భారత్ పథకం కింద నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్ అందుబాటులోకి వచ్చాక.. ఇక్కడ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను ఆపడానికి ప్లాట్‌ఫామ్‌ను విస్తరిస్తున్నారు. ప్రయాణికులు అదనంగా MMTS రైళ్లు, ఇతర ఎక్స్‌ప్రెస్‌లు, అలాగే ఆర్టీసీ బస్సు సర్వీసుల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.