Amazon Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా అమెజాన్ రూ.58 వేల కోట్లతో రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ సెంటర్ల విస్తరణకు ఈ భారీ పెట్టుబడి దోహదపడుతుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే రేవంత్ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి ఈ ఒప్పందం ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా.. హైదరాబాద్ డేటాసెంటర్ రాజధానిగా మారనుంది.